నాగర్‌కర్నూల్‌లో వేలాది కోళ్లు మృతి.. రైతుల్లో ఆందోళన

నాగర్‌కర్నూల్‌లో వేలాది కోళ్లు మృతి.. రైతుల్లో ఆందోళన
నాగర్‌కర్నూల్, మార్చి 9 (ఎస్‌బి న్యూస్): నాగర్‌కర్నూల్ జిల్లాలో పౌల్ట్రీ రైతులను అంతుచిక్కని వైరస్ వణికిస్తోంది. జిల్లాలోని పెద్దకొత్తపల్లి, నాగర్‌కర్నూల్ మండలాల్లో సోమవారం పలు పౌల్ట్రీ ఫారాల్లో ఒక్కసారిగా వేలాది కోళ్లు మృతి చెందాయి. ఒకే రోజులో సుమారు 10 వేల కోళ్లు చనిపోయినట్లు రైతులు తెలిపారు.
ఈ ఘటనతో పౌల్ట్రీ రైతులకు భారీ నష్టం వాటిల్లింది. కోళ్ల మృతి కారణాలపై అధికారులు అప్రమత్తమై విచారణ చేపట్టారు. నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపనున్నట్లు తెలిపారు. బర్డ్ ఫ్లూ కారణమై ఉండొచ్చని రైతులు అనుమానం వ్యక్తం చేస్తుండగా, పరీక్షా నివేదికలు వచ్చిన తర్వాతే అసలు కారణం స్పష్టమవుతుందని అధికారులు పేర్కొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు