గుండాల మండల కేంద్రంతో పాటు కాచనపల్లి, మామకన్ను, తూరుబాక గ్రామాల్లో ముస్లిం సోదరులు రంజాన్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రం, కాచనపల్లి గ్రామాలలోని ఈద్గాలు మరియు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాసాలను భక్తి శ్రద్ధలతో ఆచరించిన అనంతరం, నెలవంక దర్శనంతో శనివారం ఈద్-ఉల్-ఫితర్ పండుగను ఆనందంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఒకరికి ఒకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రషీద్, సాబీర్, అబ్దుల్ నబీ, యాకూబ్, మక్బూల్, సాహెబ్, అత్తర్, మహమూద్, సుభాని, ఖదీర్, నయీమ్, పాషా, చోటు, వసీం, రోషన్, కుద్దూస్, అజ్జు, ఇస్రార్, ముజీబ్, ఖాసీం, షాహిద్, పప్పీ, యూసుఫ్, ఇమ్రాన్, అఫ్రోజ్, సమీర్, జావిద్, వాజిద్, అబూబకర్ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు