భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం గౌరారం గ్రామపంచాయతీ పరిధిలో లింగాపురానికి చెందిన మడకం లక్ష్మి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. డయాలసిస్ చికిత్స కోసం అవసరమైన ఖర్చులు భరించలేక కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పనికి వెళ్లినప్పుడే జీవనం సాగించే పరిస్థితి ఉండడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.
ఈ విషయం తెలుసుకున్న ద్వాదశ జ్యోతిర్లింగ మహాక్షేత్రం చిన్న అరుణాచలం (నరసాపురం) ఆలయ వ్యవస్థాపకులు శ్రీ శివ నాగ స్వామి స్పందించి మానవతా దృక్పథంతో ముందుకు వచ్చారు. మడకం లక్ష్మి చికిత్స కోసం ప్రతి నెల రూ.2000 ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు. అదేవిధంగా కుటుంబ అవసరాల కోసం 25 కేజీల బియ్యం కూడా అందించారు.
ఈ సహాయాన్ని ట్రస్ట్ సభ్యులు మోహనా చారి, ఆలయ నిర్వహణ సభ్యుడు మహేష్ కలిసి బాధిత కుటుంబానికి అందజేశారు. భవిష్యత్తులో ఏ విధమైన ఆపద వచ్చినా తమను సంప్రదించాలని కుటుంబానికి భరోసా ఇచ్చారు
0 కామెంట్‌లు