అనుమతుల్లేని ఇటుక బట్టీల దందా – కాలుష్యంతో గ్రామాల నరకయాతన

అనుమతుల్లేని ఇటుక బట్టీల దందా – కాలుష్యంతో గ్రామాల నరకయాతన
అశ్వాపురం మండలంలో నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలు విస్తరిస్తూ వాయు కాలుష్యాన్ని తీవ్రంగా పెంచుతున్నాయని సామాజిక సేవకుడు కర్నె బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్, ఐటిడిఏ పీఓలకు ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అనుమతులు లేకుండానే బట్టీలు నిర్వహిస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నారని విమర్శించారు.
మొండికుంట, తుమ్మల చెరువు, సర్వాయిపాడు, గొల్లగూడెం తదితర గ్రామాల ప్రజలు కాలుష్యంతో అనారోగ్యాలకు గురవుతున్నారని తెలిపారు. వ్యవసాయ పంటలు దెబ్బతింటున్నాయని, బూడిద గాలులతో ఇళ్లలోకి చేరుతోందన్నారు. వలస కార్మికులపై శ్రమ దోపిడీ, బాల కార్మికత్వం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అక్రమ బట్టీలను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు