నిరుపేదల సొంతింటి కల ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యం.. కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాలకు మహర్దశ

తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను అశ్వాపురం మండలంలోని బుడుగు బజార్ గ్రామం నందు పలు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇంటి దెగ్గరికి వెళ్లి నిర్మాణ పనులు ఎంతవరకు జరిగాయి అని తెలుసుకున్న అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య మాట్లాడుతూ... నిరుపేదల సొంతింటి కల ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యం.. కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాలకు మహార్దశ తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారి చేతుల మీదగా నియోజకవర్గ మొత్తం 4,500 ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వగా  అశ్వాపురం మండలంలో మొదటి విడతలో 817 మంది లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా నేడు పినపాక ఎమ్మెల్యే పాయం గారి ఆదేశాల మేరకు పార్టీ నాయకులతో కలిసి మండలంలోని పలు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇండ్లను సందర్శించామని, త్వరగా ఇంటి నిర్మాణాలను పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధమవ్వాలని అదేవిధంగా రెండవ విడతలో ఏప్రిల్ నెలలో  మళ్లీ  మన శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తానని తెలియజేశారని ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు ఓరుగంటి రమేష్ బాబు, గొల్లపల్లి నరేష్ కుమార్, వేముల విజయ్, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు