గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘చదువుకో తెలంగాణ’ కార్యక్రమానికి సంబంధించిన పదో తరగతి ప్రత్యేక కరపత్రాన్ని బుధవారం మండల విద్యాశాఖ అధికారి కె. పార్వతమ్మ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థుల కోసం శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ రూ.2.2 కోట్ల విలువైన ప్రతిభా పురస్కారాలను ప్రకటించిందని తెలిపారు. విద్యార్థుల్లో పోటీ భావన పెంపొందించి, మెరుగైన ఫలితాలు సాధించేందుకు ‘చదువుకో తెలంగాణ’ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు.ఈ పోటీలో రాష్ట్ర స్థాయి ప్రథమ స్థాన విజేతకు రూ.5 లక్షలు,రెండవ స్థాన విజేతకు 3 లక్షలు ,జిల్లా స్థాయి ప్రథమ స్థాన విజేతకు రూ.2 లక్షలు, నియోజకవర్గ స్థాయి ప్రథమ స్థాన విజేతకు రూ.1 లక్ష, మండల స్థాయి ప్రథమ స్థాన విజేతకు రూ.10 వేల నగదు బహుమతి అందజేయనున్నట్లు వివరించారు.అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఇలాంటి అవకాశం కల్పించిన శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఖమ్మం బ్రాంచ్ యూనిట్ మ్యానేజర్ మలిపెద్ది చిరంజీవి,తవిడిశెట్టి రాంబాబు, మలిపెద్ది పవన్,పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు,గ్రామస్తులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు