పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు డాక్టర్ దుర్గాభవాని కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు.
అనంతరం డాక్టర్ దుర్గాభవాని మాట్లాడుతూ మహిళలు కుటుంబం, సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సమాజంలో మహిళలకు సమాన హక్కులు, గౌరవం లభించాలనే లక్ష్యంతో మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది మరియు స్థానిక మహిళలు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు