పినపాక
పినపాక మండలం పాండురంగాపురం గ్రామపంచాయతీలో మిషన్ భగీరథ నీటి పైప్‌లైన్‌కు అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్ మోటర్లను
ఎంపీడీఓ వెంకటేశ్వర రావు
తొలగించారు. పినపాక మండలం పాండురంగాపురం , వెంకటరావుపేట, గ్రామాల్లో ఆయన ఇంటింటికి భగీరథ నల్లాలను పరిశీలించారు. ఈ చర్యల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా అక్రమ కనెక్షన్లను గుర్తించి తొలగించారు. గ్రామంలో ప్రజలకు నిరంతరంగా స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమ చర్యలు పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ప్రశాంతి, నాగిని, గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు
0 కామెంట్‌లు