పినపాక మండలంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే రేగా - పలు కుటుంబాలకు పరామర్శ

పినపాక మండలంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే రేగా 
- పలు కుటుంబాలకు పరామర్శ 
పినపాక మండలం మల్లారం గ్రామంలో ఇటీవల మృతి చెందిన బండి లక్ష్మీ దశదిన కర్మల కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి, బండి లక్ష్మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పినపాక మండలం ఎల్చి రెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని ఐలాపురం గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన యాగడి రాజయ్య కుటుంబాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు పరామర్శించారు.
ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధైర్యం చెప్పారు. ఆయన వెంట పినపాక మండల బీఆర్‌ఎస్ అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి , పోలిశెట్టి సత్తిబాబు , గుమ్మడి గాంధి , వాసుబాబు , మదర్ సాహిబ్ , గొంది నాగభూషణం , పూనెం వెంకటనర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు