ఏడూళ్ల బయ్యారం క్రాస్‌రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం

ఏడూళ్ల బయ్యారం క్రాస్‌రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం
పినపాక:పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం క్రాస్‌రోడ్ కూడలి వద్ద లారీ–ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐలాపురం గ్రామానికి చెందిన వ్యక్తికి తృటిలో ప్రాణాపాయం తప్పింది.ప్రమాదంలో బాధితుడు స్వల్ప గాయాలతో బయటపడగా, స్థానికులు వెంటనే స్పందించి ఆయనను సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. రహదారి కూడళ్ల వద్ద వాహనదారులు మరింత జాగ్రత్తగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో దుకాణాలు నిర్వహిస్తున్న వాహనదారులు రోడ్డుపై వాహనాలు నిలపకుండా చూసుకోవాలని ఎస్ఐ సురేష్ తెలిపారు. గతంలో డ్రైనేజ్ వరకు ఎటువంటి బోర్డులు కానీ, వాహనాలు నిలపనవద్దని పంచాయతీ నుండి నోటీసులు సైతం జారీ చేసినట్లు తెలిసిందన్నారు. వాహనదారులు పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేసుకోకపోతే శాఖ పరమైన చర్యలు తప్పవని తెలియజేశారు. ప్రమాదాలు తగ్గించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు