పినపాక:పినపాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయని కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ తెలిపారు. శనివారం పినపాక ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఆయన మాట్లాడుతూ, ప్రాక్టికల్ పరీక్షలు రెండు స్పెల్స్‌లో నిర్వహిస్తున్నామని చెప్పారు. వారం నుండి ప్రారంభమైన పరీక్షలు ఈనెల 11వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. ఈ పరీక్షలకు కేజీబీవీ కళాశాల విద్యార్థులు కూడా హాజరవుతున్నట్లు తెలిపారు.
పరీక్షలు పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతున్నాయని, విద్యార్థులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రిన్సిపల్ తెలిపారు.
0 కామెంట్‌లు