ఈ–బయ్యారం వర్తక సంఘం ఆధ్వర్యంలో ఎంపీడీవో వెంకటేశ్వరరావుకు సన్మానం

పినపాక మండలం ఈ–బయ్యారం వర్తక సంఘం ఆధ్వర్యంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వరరావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని వర్తక సంఘం అధ్యక్షులు గుండు సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, గతంలో ఎంపీవోగా పనిచేసినప్పటి నుంచే గ్రామాల అభివృద్ధికి ఆయన చురుకైన సహకారం అందించారని, ప్రస్తుతం ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించడం ఆనందకరమని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
అనంతరం ఈ–బయ్యారం క్రాస్‌రోడ్ల వద్ద ఉన్న సమస్యలను ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా క్రాస్‌రోడ్ ప్రాంతంలో ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా మారిన బాత్రూం సమస్యను పరిష్కరించాలని, అలాగే ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్ ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎంపీడీవో, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వర్తక సంఘం నాయకులు భాస్కర్ రెడ్డి, మోహన్ రావు, లక్ష్మణ్, గీదా సాయి, గ్రామస్థులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు