నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 05 (ఎస్‌బి న్యూస్):
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఖర్చుల ఖాతాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యయ పరిశీలకులు భీమ్లా హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థి తన ఎన్నికల ఖర్చుల ఖాతాలను నిబంధనల ప్రకారం సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఖర్చుల ఖాతా రిజిస్టర్, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, రశీదు బిల్లులు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.
అభ్యర్థులు తమ ఖర్చుల వివరాలను సహాయ వ్యయ పరిశీలకుల వద్ద తనిఖీ చేయించుకోవాలని, ఫిబ్రవరి 7 మరియు 9 తేదీలలో ఖర్చుల వివరాలను కార్యాలయానికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యయ పరిశీలకులు పర్వీన్ బేగం, అకౌంటెంట్ టీం వెంకట్ రాములు, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, ఎస్సై గోవర్ధన్ పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, రిటర్నింగ్ అధికారులు హాజరయ్యారు.
#నాగర్‌కర్నూల్ #మున్సిపల్ఎన్నికలు #ఎన్నికలఅవగాహన #ఖర్చులఖాతాలు #ElectionExpenditure #MunicipalElections #TelanganaNews #SBNews
0 కామెంట్‌లు