మేడారంలో హుండీల లెక్కింపు రెండో రోజు కొనసాగింది. ఈ రోజు మొత్తం 160 హుండీలు లెక్కించగా రూ.3,54,25,200 నగదుతో పాటు రూ.63,436 విలువైన విదేశీ కరెన్సీ లభ్యమైంది.
రెండు రోజుల పాటు నిర్వహించిన హుండీల లెక్కింపులో మొత్తం 285 హుండీలు పరిశీలించగా, మొత్తం ఆదాయం రూ.6,04,53,636గా నమోదైంది. భక్తులు భారీగా సమర్పించిన కానుకలతో మేడారం హుండీ ఆదాయం విశేషంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
హుండీ లెక్కింపు ప్రక్రియను పటిష్ట భద్రత, పారదర్శక విధానాలతో చేపట్టామని, అన్ని నిబంధనలను పాటిస్తూ లెక్కింపు పూర్తి చేశామని సంబంధిత అధికారులు వెల్లడించారు.
0 కామెంట్‌లు