పినపాక
పినపాక తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పినపాక తహసీల్దార్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సామాజిక సమానత్వం, న్యాయం, సోదరభావం ప్రాధాన్యతను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ రమేష్, సీనియర్ సహాయకులు వై.శ్రీనివాసరావు, జూనియర్ సహాయకులు అఖిల్, జిపిఓలు సతీష్ కుమార్, వెంకటమ్మ, లక్ష్మయ్య, నాగయ్య, నాగరాజు, రామకృష్ణ, నవీన్, యువకుమార్, ముద్రాక్షకులు రవికుమార్, భూభారతి ఆపరేటర్ అఖిల్‌తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
0 కామెంట్‌లు