నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరాలి: డాక్టర్ వంశీకృష్ణ

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 07,(ఎస్ బి న్యూస్):
నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని టి పీ సీసీ ఉపాధ్యక్షులు,నాగర్‌కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పిలుపునిచ్చారు.
 జిల్లా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కూచకుల్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డిల తో కలిసి మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులతో ఆయన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ, ప్రతి వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఇంటింటా గడపగడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని అన్నారు.
మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు, పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో పార్టీపై నమ్మకం పెంచే విధంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు