మణుగూరు ప్రభుత్వ ఐటిఐ లో పిఎంకెవివై పథకం ద్వారా ఏర్పాటుచేసిన షార్ట్ టర్న్ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఐటిఐ ప్రిన్సిపాల్ జి రవి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మణుగూరు ప్రభుత్వ ఐటిఐ లో పిఎంకెవివై పథకం కింద అసిస్టెంట్ ఎలక్ట్రిషన్, మెకానికల్ మెయింటెనెన్స్ కోర్సులలో మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. పినపాక నియోజకవర్గం పరిధిలోని నిరుద్యోగ యువత ఇటువంటి శిక్షణను సద్వినియోగం చేసుక 18 నుంచి 35 సంవత్సరాల వయసు కలిగి ఉండి పదవ తరగతి ఉత్తీర్లై ఉండాలన్నారు. ప్రవేశం పొందగూరువారు పదో తరగతి మెమో ఆధార్ కార్డు పాస్ ఫోటోలతో మణుగూరు ప్రభుత్వ ఐటిఐ లో సంప్రదించాలని తెలిపారు. మార్చి నెల నుంచి మొదటి బ్యాచ్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 9989 637594, 9492959511,9390895580లకు ఫోన్ చేసి తెలుసుకోవాలన్నారు Satyam Babu update.✍🏿
0 కామెంట్‌లు