సమ్మెకు దూరంగా ఉండండి – మణుగూరు ఏరియా జీఎం రామచందర్

మణుగూరు సింగరేణి ఏరియాలో ఫిబ్రవరి 12న కార్మిక సంఘాలు ప్రకటించిన సార్వత్రిక సమ్మెకు కార్మికులు దూరంగా ఉండాలని ఏరియా జీఎం రామచందర్ సూచించారు. సంస్థ అభివృద్ధి, ఉత్పత్తి లక్ష్యాలు దృష్టిలో పెట్టుకుని విధులకు హాజరై సహకరించాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం చర్చల ద్వారానే ముందుకు వెళ్లాలని, సమ్మె వల్ల సంస్థకు మరియు కార్మికులకు నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. క్రమశిక్షణ పాటించి శాంతియుత వాతావరణం కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
#Manuguru #Singareni #StrikeAlert #CoalMines #WorkersUpdate #TelanganaNews #SBNews

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు