-పాత చట్టం ప్రకారం పనులు కొనసాగించాలి : తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం
పినపాక
జి.రాంజీ–జి బిల్లును రద్దు చేసి పాత చట్టం ప్రకారం పనులు కొనసాగించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బొగ్గం శంకర్ డిమాండ్ చేశారు.పినపాక మండలం సింగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పినపాక మండల కమిటీ ఆధ్వర్యంలో
గ్రామపంచాయతీ సర్పంచ్ ముక్తేష్ , ఉప సర్పంచ్ కిషోర్ లకు వినతి పత్రం అందజేశారు.
ఈ విషయమై గ్రామపంచాయతీ స్థాయిలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు బొగ్గం శంకర్, మడివి నందు, సెక్రెటరీ ఆదినారాయణ, సంఘ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు