పాల్వంచ మెడికల్ కాలేజీ వద్ద ప్రమాదం – విద్యార్థినులకు స్వల్ప గాయాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మెడికల్ కాలేజీ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాలేజీకి చెందిన బస్సు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో బస్సు అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనలో పలువురు విద్యార్థినులకు స్వల్ప గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని సమాచారం.
బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల అసలు కారణాలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు