అవార్డులు రివార్డులు గుండాల గ్రామానికే రావాలి..... -సంపూర్ణత అభియాన్ 2.0' లో కలెక్టర్ పాటిల్ పునరుద్ఘాటన

అవార్డులు రివార్డులు గుండాల గ్రామానికే రావాలి. సంపూర్ణత అభియాన్ 2.0' లో కలెక్టర్ పాటిల్ పునరుద్ఘాటన.
గుండాల మండలం ఫిబ్రవరి 5 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి

మండల అభివృద్ధిలో ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు భాగస్వామ్యం కావాలని అప్పుడే మండలం పూర్తి స్తాయిలో అభివృద్ధి దిశగా నడుస్తోందని జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ అన్నారు. యాస్పిరేషన్ బ్లాక్ లో బాగంగా గురువారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రినందు సంపూర్ణ అభియాన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంబిం పచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో విధిగా హెల్త్ క్యాంపులను నిర్వహించి వ్యాదినిర్ధారన కొరకు రక్త నమూనాలను తీసుకొని క్షయ నివారణ కొరకు ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. సర్పంచులు విధిగా అంగన్వాడి కేంద్రాలను, పాఠశాలలను సందర్శించి అక్కడి వసతులను పరిశీలించాలని, అంగన్వాడి కేంద్రాలలో పిల్లలకు అందించే పౌష్టికాహారం సక్రమంగా అందుతుందా లేదా అని చూడాలని అన్నారు. అలాగే గ్రామాల్లో పశువులకు రోగనిరోదక టీకాలను వేయాలని పశువైద్యాధికారులకు సూచించారు. వరి, మొక్క జొన్న పంటలతో పాటు అధిక లాబాలను అందించే మునగా, ఆకుకూరలను సాగుచేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. చదువుకొని ఉపాదిలేక ఖాళీగా ఉన్న నిరుద్యోగ యువతకు వేతనంతో కూడిన ఉచిత శిక్షణ ఇప్పించి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని మండలంలోని నిరుద్యోగులు అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసి స్టాల్స్ ను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఇఒ నాగలక్ష్మి, డి ఎం హెచ్ ఓ తుకారం, సిపిఒ సంజీవరావు, జిల్లా సంక్షేమాదికారి స్వర్ణకుమారిలెనీన, జిల్లా పశువైద్యాధికారి వెంకటేశ్వరావు, సిడిపిఒ మంగతాయారు, తహసీల్దారు ఖాసీం, ఎంపిడిఒ బాలరాజు, వైద్యాదికారి మనీష్ రెడ్డి, సుదీప్, సర్పంచులు, అంన్వాడి టీచర్లు పాల్గొన్నారు.

కోరం సీతారాములు

డ్రైనేజీ సమస్య తీవ్రంగా మారడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మురుగు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో దుర్వాసన, దోమల బెడద పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి డ్రైనేజీ కాలువలను శుభ్రపరిచి శాశ్వత పరిష్కారం చూపాలని వినతిపత్రం అందజేశారు.

 ముక్తి సత్యం

మండల కేంద్రంలోని పెద్దతోగు గ్రామం చాలా మారుమూల గ్రామం. ఈ గ్రామం ముత్తాపురం గ్రామం నుండి పెద్దతోగు గ్రామంకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామంకు 2023లో రోడ్డు మంజూరు అయినా కూడా ఇప్పటి వరకు రోడ్డు పనులకు మోక్షం లేదు. ఆ రోడ్డుపై ప్రస్తుతం కనీసం ఏడ్ల బండ్లు కూడా ప్రయాణించే పరిస్థితి కుడా లేదు. తక్షణమే రోడ్ మంజూరు చేయగలరని గ్రామ ప్రజలు, గుండాల మండల మాజీ ఎంపీపీ ముక్తి సత్యం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ కు వినతి పత్రం అందజేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.


అజయ్(బికోజి):

గుండాల మండల కేంద్రంలో మరుగుదొడ్ల నిర్మించండి.
ఇలా పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేసి సమస్యలు వివరించగా మరుగుదొడ్లు వెంటనే అమలు చేస్తా అని దానికి సంబందించిన స్థలం గ్రామస్తులు కేటాయించడమే ఆలస్యం అని కలెక్టర్ తెలిపారు

గడ్డం లాలయ్య:

 గుండాలలో మార్కెట్ యార్డ్ నిర్మించాలని, రైతులు మూడు పంటలు పండిస్తున్నారని , మార్కెట్ యార్డ్ దరిదాపులలో లేనందున రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో కలెక్టర్ సానుకూలంగా స్పందించారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు