Subscribe Us

SB LATEST:

3, జనవరి 2026, శనివారం

రోడ్డు విస్తరణ చేశారు ...మధ్యలో విద్యుత్ స్తంభాలు మరిచారు

రోడ్డు విస్తరణ చేశారు… విద్యుత్ స్తంభాలు మరిచారు
తక్షణ చర్యలు తీసుకోవాలి : బీఆర్‌ఎస్ యూత్ అధ్యక్షులు గుర్రం సృజన్
మణుగూరు పట్టణం నాయుడుకుంట (చెరువు కట్ట) ప్రాంతంలో ఇటీవల చేపట్టిన సీసీ రోడ్డు విస్తరణ పనుల్లో తీవ్ర నిర్లక్ష్యం చోటు చేసుకుందని మణుగూరు పట్టణ బీఆర్‌ఎస్ యూత్ అధ్యక్షులు గుర్రం సృజన్ ఆరోపించారు.
రోడ్డు విస్తరణ చేసినప్పటికీ రోడ్డుమధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించకపోవడం, పైప్‌లైన్ పనులను పూర్తి చేయకపోవడం వల్ల రాత్రి వేళ ప్రజలు, వాహనదారులు తీవ్ర ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అనుకోని ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవిస్తే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని—మున్సిపాలిటీ అధికారులా, విద్యుత్ శాఖ అధికారులా అని ప్రశ్నించారు.
ఈ పరిస్థితిపై వెంటనే స్పందించి, సీసీ రోడ్డుమధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి, పైప్‌లైన్ పనులు పూర్తిచేసి ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత ప్రభుత్వ శాఖలను వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆవుల శ్రీనివాస్, జక్కం రంజిత్, సాయి వెంకటేష్, యన్న భాను, అయినాల తరుణ్ తదితరులు పాల్గొని సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ప్రజల భద్రతే ప్రథమ లక్ష్యంగా అధికారులు వ్యవహరించాలని బీఆర్‌ఎస్ యూత్ నాయకులు స్పష్టం చేశారు.