Subscribe Us

SB LATEST:

24, డిసెంబర్ 2025, బుధవారం

తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై సస్పెన్షన్ వేటు వేసిన డీజీపీ



వరంగల్ పోలీస్ డివిజన్ మట్టెవాడ ఠాణాలో గతంలో తప్పుడు కేసులు నమోదు చేసి పలువురిని ఇబ్బందులకు గురిచేశారంటూ అప్పటి ఏసీపీ నందిరాంనాయక్, మట్టెవాడ ఇన్స్‌పెక్టర్ టి.గోపిరెడ్డి, సబ్ ఇన్స్‌పెక్టర్ విఠల్‌ను డీజీపీ శివధర్ రెడ్డి సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ 

వరంగల్‌కు చెందిన వ్యక్తిపై కక్ష సాధింపులో భాగంగా అతడు ఓ ఇంట్లోకి ప్రవేశించి దోపిడీకి పాల్పడ్డాడంటూ మట్టెవాడ ఠాణాలో గతేడాది తప్పుడు కేసు నమోదు చేసి రిమాండుకు తరలించేందుకు ప్రయత్నం

విషయం తెలుసుకుని తనపై తప్పుడు కేసు నమోదు చేశారని హైకోర్టును ఆశ్రయించిన బాధితుడు

ఘటన జరిగిందంటూ చెబుతున్న సమయంలో తాను అక్కడ లేనంటూ అందుకు సంబంధించిన అన్ని ఆధారాలను కోర్టులో సమర్పించిన బాధితుడు 

దీనిపై సమగ్ర విచారణ చేయాలని న్యాయస్థానం వరంగల్ కమిషనరేట్ పోలీసులను ఆదేశాలు జారీ 

ఉన్నతాధికారులకు నివేదిక ప్రకారం పది నుంచి పదిహేను వరకు తప్పుడు కేసులు నమోదు చేసినట్లు గుర్తించి.. ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసిన డీజీపీ