పినపాక మండల పరిధిలోని 23 గ్రామపంచాయతీలలో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన సర్పంచ్లు, వార్డు మెంబర్లు అందరూ ఎన్నికల ఖర్చు వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని ఎన్నికల వ్యయ అధికారి వీరేష్ బాబు స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో చేసిన ఖర్చుల వివరాలు, వ్యయ నిర్వహణ పుస్తకాలు, బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ను ఈ నెల 29వ తేదీలోగా ఎంపీడీవో కార్యాలయం, పినపాకలో సమర్పించాలని ఆయన సూచించారు.
సర్పంచ్ అభ్యర్థులు ప్రచారానికి వినియోగించిన వాహనాలు, మైకులు, ర్యాలీలు తదితరాలకు సంబంధించిన ఖర్చుల వివరాలు కూడా స్పష్టంగా తెలపాలని అన్నారు. నిర్ణీత గడువులోగా ఎన్నికల వ్యయ వివరాలు సమర్పించని పక్షంలో, సంబంధిత అభ్యర్థులు ఐదు సంవత్సరాల పాటు ఎటువంటి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాదని హెచ్చరించారు.
కావున, అభ్యర్థులందరూ నిబంధనలను పాటిస్తూ సకాలంలో సరైన ధ్రువపత్రాలతో కూడిన ఎన్నికల ఖర్చు వివరాలను సమర్పించాలని ఎన్నికల వ్యయ అధికారి వీరేష్ బాబు కోరారు.
