Subscribe Us

SB LATEST:

15, డిసెంబర్ 2025, సోమవారం

రాజకీయ పార్టీలను గెలిపిస్తే గెలిచేదొక్కడు ఏలేది ఒకడు

గుండాల మండలం డిసెంబర్ 15 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి
ముత్తాపురం గ్రామపంచాయతీ పరిధిలోగల గ్రామాలలో బైక్ ర్యాలీ సందర్భంగా పంచాయతీ ఎన్నికల ప్రచారంలో అనంతరం పెద్దతొగు గ్రామంలొ ఆదివాసి సంక్షేమ పరిషత్ బలపరిచిన స్వాతంత్ర్య అభ్యర్థి కల్తీ రాధ, ఆదివాసి సంక్షేమ పరిషత్ గుండాల మండల అధ్యక్షులు పూనెం రమణబాబు మాట్లాడుతూ, గ్రామపంచాయతీలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ బలపరిచిన అభ్యర్థి వైపే ఆదివాసీల ఓట్లు.
గిరిజనేతర రాజకీయ పార్టీలకు వెన్నులో వొనుకు మొదలైయిందని అందుకే కొన్ని రాజకీయ పార్టీలు బెదిరింపులకు పాల్పడుతున్నారని దమ్ముంటే ప్రజల మనసుగేలుసుకొని గెలవాలి కానీ ఓటమి భయంతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని, ఏజెన్సీ ప్రాంతంలో కి కాంగ్రెస్ పార్టీ 1976లో రాజ్యాంగం విరుద్ధంగా st జాబితాలో కలిపితే దానినీ వ్యతిరేకించెం శక్తి లేని కమ్యూనిస్ట్ పార్టీలు ఏజెన్సీ ప్రాంతంలోకి వలసలు పెంచిపొచ్చించింది మీరు కదా.. అని, ఇప్పుడు 1/70 చట్టాన్ని సవరణ చేసి గిరిజనేతరులకు అవకాశం కలిపించాలని ఎన్నికలు ప్రచారం లో హోరేత్తిస్తున్నారు అంటే మీరు ఎవరు వైపో ఆదివాసీ ప్రజలే అర్ధం చేసుకొని ఈ ఎన్నికలలో మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని,పోడు భూముల్లోకి ఫారెస్ట్ అధికారులు 2020 జనవరి 1 తారీఖున ఆర్ శోభ చీప్ కన్జర్వేషన్ ఆఫ్ హెడ్ అఫ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైఫాబాద్ హైదరాబాదు నుంచి, త్రీ పీస్ కరెంటు అనుమతులిసస్తూ జీవో జారీ చేస్తే ఏజెన్సీ ప్రాంతంలోకి మేమే కరెంట్ తెచ్చాము అని డబ్బా కొట్టుకుంటున్నారు, పొడుభూముల పట్టాలు ఇప్పించమని చెప్పుకొనే ఈ పార్టీలు ఫారెస్ట్ అధికారులు ఈ ప్రాంతంలో పొడుభూములలో ట్రెంచీలు కొడుతుంటే ఎక్కడ నిద్రపోయారో చెప్పాలి అని, ఈ ప్రాంతంలో రాజకీయ పదవులు అనుభవించింది మీరే కదా అలాంటి అప్పుడు నడిమిగూడెం,పెద్దతోగు గ్రామాలకు కనీసం తట్టేడు మట్టి అయినా ఎందుకు వేయలేకపోయారో చెప్పాలి అని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. వీటికి సమాధానం చెప్పలేక బట్ట కాల్చి మీద వేసే పరిస్థితికి దిగజారుడు తనానికి వచ్చారు అంటేనే మేమే నైతికంగా విజయం సాధించం అని అన్నారు, ఎన్నికల ప్రచారంలో గిరిజనేతరులు కూడా వచ్చి ప్రచారంలో పాల్గొనడం షెడ్యూల్డ్ ప్రాంతానికి విరుద్ధమని రేపు ఇదే పార్టీలు గెలిచినాక గిరిజనుల వైపు మాట్లాడుతాయా గిరిజనతరల వైపు మాట్లాడుతాయా ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, ఈ కార్యక్రమంలో పెద్దతోగు గ్రామ ప్రజలు మరియు ఆదివాసి సంక్షేమ పరిషత్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.