వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవడానికి ఇటీవల అందుబాటులోకి బయోచార్' వినియోగం వచ్చిందని ఎంపీడీవో సంకీర్త్ తెలిపారు. శుక్రవారం ఆయన ఎంపీడీవో కార్యాలయంలో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశానుసారం పినపాక మండలంలో 23 గ్రామపంచాయతీల లో డంపింగ్ యార్డ్ ల వద్ద దీనిని తయారు చేస్తున్నట్లు తెలిపారు. బయో చార్ ను కట్టె బొగ్గు అనొచ్చన్నారు. పంట వ్యర్థాలతో రైతులే స్వయంగా దీన్ని తయారు చేసుకొని పొలాల్లో వేసుకోవచ్చన్నారు.
బయో అంటే జీవం అని చార్ (చార్కిల్) అంటే బొగ్గు అని బయోచార్ అంటే 'జీవం ఉన్న బొగ్గు' అని వివరించారు.ఇది భూసారానికి ముఖ్యమైనది సేంద్రియ కర్బనం అన్నారు. దీనిని ఉపయోగించటం వల్ల యూరియా కంటే అధిక లాభాలు ఉంటాయని తెలిపారు. పంచాయతీలో తయారుచేసిన బయోచారును రైతులకు అందజేస్తామని తెలిపారు. బయో చార్ పై రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
