శివ మాలదారులు బిక్షాటన చేయటానికి కారణం ఇదే

లోక క్షేమం కోరి శివ స్వాములు బిక్షాటన.... సీతంపేట గ్రామంలో బిక్షాటన చేస్తున్న శివ మాలదారులు 
పినపాక:శివదీక్ష తీసుకున్న భక్తులు శివుని పట్ల తమ అంకితభావాన్ని చాటుకోవడానికి, లోక క్షేమాన్ని కోరి భిక్షాటన కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం ఉదయం మండల పరిధిలోని సీతంపేట శివాలయం నుండి సీతంపేట, పినపాక గ్రామాలలో మాలదారులు బిక్షాటన చేశారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు మాట్లాడుతూ బిక్షాటన చేయడం అన్నది క్రమశిక్షణ, త్యాగం, మరియు శివుని పట్ల గౌరవాన్ని సూచిస్తుందన్నారు.
భిక్షాటన అనేది భౌతిక సంపదల పట్ల నిర్లిప్తతను, స్వీయ-త్యాగాన్ని, ఆధ్యాత్మికతను సూచిస్తుందన్నారు. 
హిందూ పురాణాల ప్రకారం శివుడు భిక్షగాడిగా మారి ఊరూరా తిరుగుతూ భిక్షమెత్తేవాడన్నారు. ఈ రూపం ద్వారా, సంపద అనేది నిత్యం కాదని, అది ఒక మాయ అని శివుడు తెలియజేస్తాడని స్వామి మాలదారులు వివరించారు.