– విద్యార్థులను అభినందించిన ఎంఈఓ నాగయ్య
పినపాక:పినపాక మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం జనవిజ్ఞాన వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన చెకుముకి టాలెంట్ పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎడుల్ల బయ్యారం విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానం దక్కించుకున్నారు.మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి పలువురు విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలలో జడ్పీహెచ్ఎస్ ఎడుల్ల బయ్యారం నుంచి ఇంగ్లీష్ మీడియంలో రియాజ్, దిలీప్ కుమార్, పల్లవి అలాగే తెలుగు మీడియంలో శృతి, శ్రావణి, ఆయేశా ప్రభావవంతమైన ప్రతిభతో ముందంజలో నిలిచి అందరినీ ఆకట్టుకున్నారు.విజేతలకు ఎంఈఓ నాగయ్య, పినపాక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే. రమణ చేతుల మీదుగా ప్రథమ బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటువంటి చెకుముకి టాలెంట్ టెస్టులు విద్యార్థుల మేధోశక్తి అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రతిభను వెలికి తేవడంలో కీలక పాత్ర పోషిస్తున్న జనవిజ్ఞాన వేదిక తెలంగాణ నిర్వాహకులకు ఆమె అభినందనలు తెలిపారు.విజయం సాధించిన విద్యార్థులపై పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గర్వం వ్యక్తం చేస్తూ వారి భవిష్యత్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బి. రాంబాబు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Social Plugin