అశ్వాపురం మండలంలోని పిఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ అశ్వాపురం పాఠశాలలో మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబురాలు పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి యోగితా వేణి సమన్వయం చేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, సైన్స్‌పై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు ఎంతో దోహదం చేస్తాయని, ప్రతి విద్యార్థి తమ ప్రతిభను ప్రదర్శించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిలవాలని సూచించారు. విజేతలకు మండల స్థాయి సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు.
ఇంగ్లీష్ మీడియం – మొదటి స్థానం:
పిఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ అశ్వాపురం నుంచి బి. లహరి, ఎన్. వినీల, ఇ. వెంకటేష్ గ్రూప్ విజేతలుగా నిలిచారు.
తెలుగు మీడియం – మొదటి స్థానం:
జడ్పీహెచ్ఎస్ మల్లెలమడుగు పాఠశాలకి చెందిన జె. సాకేత్, కె. జస్వంత్, జి. వెంకట పవన్ గ్రూప్ ప్రథమ స్థానాన్ని సాధించింది.
ఇంగ్లీష్ మీడియం – రెండవ స్థానం:
జడ్పీహెచ్ఎస్ మల్లెలమడుగు నుంచి బి. సుజనశ్రీ, డి. రేహాంతి, డి. అభినయ్ గ్రూప్ ద్వితీయ స్థానంలో నిలిచింది.
ఈ కార్యక్రమంలో అశ్వాపురం, గొందిగూడెం, మెట్టగూడెం, సీతారాంపురం, మల్లెలమడుగు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
