Subscribe Us

SB LATEST:

22, నవంబర్ 2025, శనివారం

పట్టపగలే పశువుల అక్రమ రవాణా



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పట్టపగలే పశువుల అక్రమ రవాణా బయటపడింది. మణుగూరు నుండి కొత్తగూడెం వైపు ప్రయాణిస్తున్న టాటా ఏస్ వాహనం అంబేద్కర్ సెంటర్ వద్ద అనుమానాస్పదంగా ఆగిపోవడంతో అక్కడి ప్రజలు ఆసక్తి చూపారు. వాహనాన్ని పరిశీలించగా అందులో 10కి పైగా ఆవులను కుక్కినట్టుగా తరలిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. లోడు ఎక్కువగా ఉండటంతో వాహనం మధ్య దారిలో ఆగిపోవడం ఈ అక్రమ రవాణా గుట్టును రట్టుచేసింది. ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పశువుల అక్రమ రవాణాను అరికట్టాలని అధికారులను కోరుతున్నారు.