Subscribe Us

SB LATEST:

27, అక్టోబర్ 2025, సోమవారం

పినపాక మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా సంకీర్త్ బాధ్యతలు స్వీకరణ

పినపాక మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా సంకీర్త్ బాధ్యతలు స్వీకరణ

పినపాక మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా సంకీర్త్ సోమవారం బాధ్యతలను చేపట్టారు. ఇటీవల గ్రూప్‌ 1 అధికారిగా నియమితులైన ఆయన పినపాక మండల ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ ఇన్‌చార్జి ఎంపీడీవోగా పనిచేస్తున్న సునీల్ కుమార్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎంపీ ఓ వెంకటేశ్వరరావు, ఏపీవో వీరభద్ర స్వామి, గ్రామపంచాయతీ సెక్రటరీలు ఆయనకు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు.