గుండాల మండలం అక్టోబర్ 12 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి
బీసీలను మభ్య పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ చూస్తుందని జీవో నెంబర్ 9 సాధ్యం కాదని తెలిసిన జీవోను తీసుకువచ్చి 42 శాతం ఇచ్చినట్లు బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతోందని ఇది ముమ్మాటికి బీసీలను మోసం చేయడమేనని గుండాల మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ నాయకులు గడ్డం వీరన్న అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా 50 శాతానికి మించి రిజర్వేషన్ ఉండకూడదని సుప్రీంకోర్టు సూచనలను సైతం లెక్కచేయకుండా అడ్డదారిన జీవో నెంబర్ తొమ్మిదిని తీసుకువచ్చింది ప్రభుత్వమని అన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా తీసుకువచ్చిన జీవో చెల్లదని తెలిసినా కూడా బీసీలను మోసం చేసి స్థానిక సంస్థల ఎన్నికలలో ఓట్లు దండుకోవటం కోసమే అడ్డదారిన ప్రభుత్వం పోతుందని అన్నారు. గవర్నర్ వద్ద బీసీ బిల్ పెండింగ్లో ఉన్నప్పుడు 42% రిజర్వేషన్ కు సంబంధించిన జీవోను ప్రభుత్వం ఎలా తీసుకువస్తుందని ఆయన అన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి అడ్డదారి నా కాకుండా రాజ్యాంగబద్ధంగా బీసీ బిల్లును అమలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. 42% రిజర్వేషన్ తీసుకువచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
Social Plugin