నాగర్ కర్నూలు,అక్టోబరు 12 (ఎస్ బి న్యూస్): రాష్ట్రం లో వెనుకబడిన కులాలకు (బీసీలు) పూర్తి స్థాయిలో రాజ్యాధికారాన్ని సాధించడమే లక్ష్యంగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో బీసీ కులాల జాయింట్ యాక్షన్ కమిటీ (బీసీ జేఏసీ)ని ఏర్పాటు చేశారు. స్థానిక పటేల్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో బీ సీ ల నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశానికి అన్ని బీసీ కుల సంఘాల పెద్దలు, మేధావులు, ఉద్యోగులు, విద్యార్థి నాయకులు, రాజకీయ బీసీ నేతలు హాజరయ్యారు. సమావేశంలో ఏకగ్రీవంగా అచ్చంపేట బీసీ జేఏసీ ఏర్పాటుపై సమ్మతిచ్చారు.
కమిటీ ముందున్న
ప్రధాన లక్ష్యాలు
బీసీ జేఏసీ ముఖ్యంగా విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థలు, అసెంబ్లీ, లోక్‌సభ స్థాయిల్లో బీసీ అభ్యర్థుల గెలుపు ఖాయంగా ఉండేలా కార్యాచరణ రూపొందించనుంది.
నూతన కమిటీ ఎన్నిక
ఈ సందర్భంగా అచ్చంపేట బీసీ జేఏసీ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గౌరవ అధ్యక్షులు: సాదే రాజు
గౌరవ సలహాదారులు: వేణుగోపాల్, గణపతి, ఎంఎం గౌడ్
అధ్యక్షుడు: మండికారి బాలాజీ
ప్రధాన కార్యదర్శి: కశన్న యాదవ్
కోశాధికారి: డ్యాగ్ అనిల్ కుమార్
కో-కన్వీనర్లు:
కేతేపల్లి వెంకటేష్, బీసం ఆంజనేయులు, భైరమోని గౌరీ శంకర్, పులిజాల రమేష్, రంగినేని రవీందర్, ఎలిమినేటి వెంకటేష్, సీతారాల శివచంద్ర, కందుకూరి నాగరాజు, మినుగా బోయ మల్లేష్, గోలి శ్రీనివాసులు, సారంగి శివ, గండు శ్రీనివాస్ గౌడ్, ఆనంద్ (నాయి బ్రాహ్మణ), మాధవచారి, పెనిమిళ్ల వెంకటేష్, గొర్ల హరీష్, బెల్లి యాదగిరి, జగదీష్ గౌడ్, వెంకటేష్ (శాలివాహన), కిట్టు (మున్నూరు కాపు), సుల్తాన్.
Social Plugin