సాగుదారుల హక్కుల పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తాం: సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా

సాగుదారులపై దాడులు దౌర్జన్యాలను ప్రతిఘటించాలి

🔹 ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుంట్రలను అడ్డుకుంటాం
🔹 గ్రామీణ ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో పాలకులు విఫలం
 🔹 ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను సమిష్టిగా అడ్డుకుందాం
🔹  గుండాల ప్రాంతాల్లో నూతన భూగర్భగనులు ఏర్పాటు చేయాలి: సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా 



గుండాల మండలం ఆగస్టు 10 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి:

 గుండాల మండలంలో ఉత్సాహంగా నాలుగో రోజు ప్రజాచైతన్య యాత్ర సిపిఐ గుండాల మండల కార్యదర్శి వాగబోయిన రమేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎస్కే షాహిద్ అధ్యక్షతన  జరిగింది సీపీఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర నాలుగో రోజైన ఆదివారం గుండాల,మండలంలో యాత్ర ఉత్సాహంగా కొనసాగింది.ఈ కార్యక్రమంలో ప్రజా చైతన్య ప్రచార జాత రాధ సారధి సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సాబీర్ పాషా మాట్లాడుతూ 
ఏజెన్సీ మండలం అయినటువంటి గుండాలలో  గిరిజన, గిరిజనేతర పోడు సాగుదారులకు వారు సాగు చేసుకుంటున్న భూములపై తక్షణమే హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా భూములను నమ్ముకుని జీవిస్తున్న పోడు సాగుదారులపై అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖలు కక్షపూరితంగా దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడటం దారుణమన్నారు. సాగుభూములను లాక్కోవడం అటవీ హక్కుల చట్టాన్ని తీవ్రంగా నీరుగార్చడమేనని మండిపడ్డారు. గ్రామీణ పేదలకు ఏకైక ఆధారంగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని దశలవారీగా నిర్వీర్యం చేసేందుకు కుట్రలు సాగుతున్నాయని విమర్శించారు. ఏండ్లు గడుస్తున్నా మారుమూల గ్రామీణ ప్రాంతాలు కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదని, సరైన రోడ్డు మార్గాలు లేక ప్రజలు దుర్భర జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలను ఖూనీ చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రశ్నించే గొంతులను నొక్కేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు తెగనమ్ముతూ, దేశ సంపదను బడాబాబులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, కనీస మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ రంగ సంస్థల రక్షణే ధ్యేయంగా 'బద్లావ్ జరూరీ హై' నినాదంతో ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నామని, సెప్టెంబర్ 1న చేపట్టే 'చలో ఢిల్లీ' కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ర్యాలీలో భాగంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా కొమరం భీమ్ మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు  
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం,
ఏఐటియుసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి నరాటి ప్రసాద్,
సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పినపాక నియోజకవర్గ కార్యదర్శి సారెడ్డి పుల్లారెడ్డి
సిపిఐ కార్యవర్గ సభ్యులు రేసు ఎల్లయ్య,
మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మీ కుమారి
సిపిఐ కార్యవర్గ సభ్యులు ఉప్పు శెట్టి రాహుల్
ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వరక అజిత్, బచ్చల రామయ్య, లక్ష్మయ్య, సాహెబ్ సమ్మయ్య, సమీర్ సంధ్యారాణి నాగమణి ఎర్రమ్మ అప్రోచ్ నాసిర్ షబ్బీర్ పవన్ కళ్యాణ్ రవి వర్మ వంశీ వరుణ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు