పత్రికా స్వేచ్ఛని అణిచివేసే ప్రయత్నాలు సహించం.


పత్రికా స్వేచ్ఛని అణిచివేసే ప్రయత్నాలు సహించం.....
 కలం కదిలితే.. అవినీతి,అక్రమాలు జడవాల్సిందే
. జర్నలిస్టుల గొంతు నొక్కొద్దు
- జర్నలిస్టులను టార్గెట్ చేస్తే ఊరుకునేది లేదు మండలంలో జర్నలిజలంతా ఐక్యంగా నిలబడి పత్రికా స్వేచ్ఛ కోసం పోరాడుదాం
 వ్యవస్థలో పత్రికా రంగం నాలుగో స్తంభంగా ప్రజల తరఫున ప్రశ్నించే కీలక బాధ్యతను నిర్వహిస్తోందని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ పరిధిలో పత్రికా స్వేచ్చ కి రక్షణ ఉందని అశ్వాపురం మండల జర్నలిస్టులు పేర్కొన్నారు.అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు నిర్వహించే విలేకరుల సమావేశాల్లో వారు వెల్లడించిన అభిప్రాయాలను ప్రజలకు చేరవేయడం జర్నలిస్టుల వృత్తి బాధ్యతలో భాగమన్నారు.విలేకరుల సమావేశంలో ఎవరు ఏం మాట్లాడారో వాస్తవాల ఆధారంగా వార్తగా రాయడమే తప్ప, జర్నలిస్టులు స్వతహాగా ఊహించుకుని వార్తలు సృష్టించరని స్పష్టం చేశారు.

వార్తల్లో వాస్తవ దోషం ఉంటే వివరణ ఇవ్వాలి..... విలేకరులను ఒత్తిడికి గురి చేయటం సరికాదు...*
వార్తలో వాస్తవ దోషం ఉంటే వివరణ ఇవ్వాలి.కానీ వార్త రాసిన జర్నలిస్టుపై ఒత్తిడి తీసుకురావడం సరికాదని అన్నారు.ప్రజా సమస్యలు, అవినీతి, అక్రమాలు, అధికారుల నిర్లక్ష్యం, బాధితుల గోడును వెలుగులోకి తీసుకురావడంలో మీడియా ఎన్నో సందర్భాల్లో కీలక పాత్ర పోషించిందన్నారు.కలం ప్రశ్నించినప్పుడు వ్యవస్థ సమాధానం చెప్పాలి.. కలాన్ని ప్రశ్నించడం ద్వారా సమస్య పరిష్కారం కాదని పేర్కొన్నారు.వార్తలపై అభ్యంతరాల పేరుతో జర్నలిస్టులపై ఫిర్యాదులు చేయడం, ఒత్తిళ్లు తీసుకురావడం పత్రికా స్వేచ్యాన్ని హరించే చర్యలుగా భావిస్తున్నామని తెలిపారు.వార్త నచ్చకపోతే ఖండన ఇవ్వడానికి, తమ వాస్తవాలను ప్రజల ముందు ఉంచడానికి ప్రతి ఒక్కరికీ అవకాశం ఉందన్నారు.

*సమస్య వస్తే ఐక్యంగా పోరాడుతాం....*
జర్నలిస్టుల గొంతు నొక్కడం కాదు.. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడమే పాలకుల బాధ్యత అని మండలంలోని ఏ జర్నలిస్టు కైనా ఏ సమస్య వచ్చినా ఐక్యంగా పోరాడతామని స్పష్టం చేశారు.ప్రజా ప్రయోజనాల కోసం నిజాలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టులు ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా తమ వృత్తి ధర్మాన్ని కొనసాగిస్తారని తెలిపారు.ఒక జర్నలిస్టుపై అనవసర ఒత్తిడి వచ్చినా అశ్వాపురం మండలంలోని జర్నలిస్టులంతా ఐక్యంగా నిలబడి పత్రికా స్వేచ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తామని ప్రకటించారు.జర్నలిస్టును ఆపితే ఒక వార్త ఆగవచ్చు కానీ ప్రజల ప్రశ్నలను ఆపలేరు అని స్పష్టం చేశారు.పత్రికా స్వేచ్చ నీ గౌరవించడం అంటే కేవలం జర్నలిస్టుల హక్కును గౌరవించడం కాదని, ప్రజలకు నిజం తెలుసుకునే హక్కును గౌరవించడమేనన్నారు.కలం ఆగదు.ప్రశ్న ఆగదు.ప్రజల కోసం పత్రికా స్వరం కూడా ఆగదని అశ్వాపురం మండల వ్యాప్తంగా ఏ జర్నలిస్టు కైనా ఇబ్బందులు తలిపితే మండల వ్యాప్తంగా ఉన్న అన్ని క్లబ్ లోని జర్నలిస్టులు ఐక్యంగా పోరాడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రెస్ క్లబ్ ల అధ్యక్షులు రాజేందర్ వెలమ, మహేష్ ,చలపతి రావు,కల్లూరు నరసింహారావు, ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు