మానాల ప్రభాకర్ బినామీ దడిగల శ్రీను దోపిడీని అరికట్టాలి

మానాల ప్రభాకర్ బినామీ దడిగల శ్రీను  దోపిడీని అరికట్టాలి

సి పి ఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు గుమ్మడి నరసయ్య చంద్ర అరుణ డిమాండ్.


*గుండాల మండలం ఆగస్టు 4 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి*

ఏజెన్సీ ప్రాంతాల్లో అమాయక గిరిజనులను, పేద ప్రజలను అప్పుల పేరుతో దోపిడీ చేసే చర్యలను అరికట్టాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు గుమ్మడి నరసయ్య, చండ్ర అరుణ డిమాండ్ చేశారు. సోమవారం గుండాల మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ సెంటర్లో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల జనరల్ బాడీ సమావేశంలో వారు ముఖ్య అతిధులుగా - పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశానికి గుండాల మాజీ సర్పంచ్ కొమరం శాంతయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గుండాల మండలం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఐదవ షెడ్యూల్ నిబంధనలు, 1/70 చట్టం అమల్లో ఉన్నాయని గుర్తు చేశారు. ఇటువంటి ప్రాంతాల్లో పేదలకు అప్పులు ఇచ్చి వారి ఇళ్లు, ఆస్తులను స్వాధీనం చేసుకోవడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు.

మానాల ప్రభాకర్, ఆయన బినామీగా పేర్కొంటున్న దడిగెల శ్రీను పేరుతో జరుగుతున్నట్లు ఆరోపిస్తున్న ఆర్థిక దోపిడీపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని కోరారు. అమాయక ప్రజలను అప్పుల ఉచ్చులోకి నెట్టి వారి ఆస్తులను కోల్పోయే పరిస్థితులు కల్పించడం సరైనది కాదని అన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకునేలా పోరాడతామని హెచ్చరించారు. గిరిజన ప్రాంతాల్లో చట్టాలను, సామాజిక ఐక్యతను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకుడు మాచర్ల సత్యం, డివిజన్ కార్యదర్శి ఈసం శంకరన్న, మండల నాయకులు తెల్ల రాజు, పూణేం లక్ష్మన్న, పూణేం మంగయ్య, కోడూరు జగన్, మోకాల అజాద్, సనప కుమార్, యనగంటి గణేష్, రమేష్, ఈసం చంద్రన్న, ఊకే బాబు, కల్తీ పాపన్న, రామన్న, దుర్గం లక్ష్మీనారాయణ, ఎట్టి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు