మన్ననూర్ గురుకుల ఫుడ్ పాయిజన్ ఘటనపై ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆరా
అచ్చంపేట: మన్ననూర్ పీటీజీ గురుకులంలో ఫుడ్ పాయిజన్‌కు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై స్థానిక ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ వెంటనే స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పటికీ వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి విద్యార్థులకు అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థికి మెరుగైన వైద్య సేవలు అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు, వైద్య సిబ్బందికి ఆదేశించారు. తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఎంపీ డా. మల్లు రవి కూడా ఘటనపై స్పందించి పరిస్థితిని పర్యవేక్షించారు.
0 కామెంట్‌లు