మణుగూరు: మణుగూరు క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సింగారం గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ గాండ్ల సురేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా సింగారం ఉపసర్పంచ్ గాండ్ల సురేష్ మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు ఆశయాలు నేటి తరానికి ఆదర్శమని అన్నారు.ఆయన చూపిన దేశభక్తి, త్యాగస్ఫూర్తిని కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.ఈ కార్యక్రమంలో మణుగూరు క్షత్రియ సేవా సమితి సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.#AlluriSitaramaRaju
#ManyamVeerudu
#AlluriJayanthi
#Manuguru
#KshatriyaSevaSamithi
#GandlaSuresh
#TributeToAlluri
#FreedomFighter
#Telangana
#SBNEWS
0 కామెంట్‌లు