గుండాల మండలం జులై 24 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో, వారి ప్రాణాలతో దారుణంగా చెలగాటం ఆడుతోంది. ఇటీవల జరుగుతున్న పరీక్షల పేపర్ లీకేజీలు మరియు అవకతవకల వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత ఆశలు గాల్లో కలుస్తున్నాయి. ఎంతో కష్టపడి రాత్రింబవళ్లు చదివిన విద్యార్థులు, తమకు న్యాయం జరగకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకునే దుస్థితికి నెట్టబడుతున్నారు.
ఈ ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఇంకెంత మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవాలి?
తమ న్యాయమైన హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై దాడులు చేయించడం, వారి గొంతు నొక్కడం బీజేపీ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి.
విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు యూత్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. యువతకు న్యాయం జరిగే వరకు ఈ అన్యాయంపై పోరాటం ఆగదని గుండాల మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ బొబ్బిలి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
0 కామెంట్‌లు