నీట్ పేపర్ లీక్ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి.

నీట్ పేపర్ లీక్ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి.

బాధ్యత లేని కేంద్రమంత్రిని రాజీనామా అడిగితే తప్పేంటి

ఒకటికి పది పేపర్ లీకులు, రాజీనామా అడిగిన విద్యార్థులను అభాసుల పాలు చేసే కుట్ర.

ధర్నాల్లో 
ఫేక్ పోలీసులు, ఫెక్ మనుషులు, విద్యార్థులకు వ్యతిరేకంగా కేంద్ర అనుకూల వర్గల కుట్రలు.


నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహించి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.

 దేశవ్యాప్తంగా విద్యార్థులు యువత డిమాండ్

*గుండాల మండలం జులై 23 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి*

నీట్ (NEET) పరీక్ష పేపర్ లీక్ ఘటన దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిందని, ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని విద్యార్థులు, యువత, అలాగే కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దేశవప్తంగా నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమల్లో విద్యార్థులు మాట్లాడుతూ, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం అత్యంత ముఖ్యమని పేర్కొంటున్నారు.

దేశంలోని విద్యార్థులు సంవత్సరాల పాటు కష్టపడి చదివి నీట్ వంటి కీలక పరీక్షలకు సిద్ధమవుతారని, అలాంటి పరీక్షల్లో పేపర్ లీక్ వంటి ఘటనలు చోటుచేసుకోవడం వల్ల విద్యార్థుల శ్రమ, ఆశలు, భవిష్యత్తు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

పేపర్ లీక్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తూన్నారు. అలాగే, పరీక్షా వ్యవస్థపై ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో విశ్వాసం పునరుద్ధరించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

నిరసనకారులు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధ హక్కు అని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై నిరసన వ్యక్తం చేసే విద్యార్థులు, యువత ఆందోళనలను గౌరవించి ప్రభుత్వం స్పందించాలని, వారి సందేహాలకు సమాధానాలు ఇవ్వాలని కోరుతున్నారు.

దేశంలో గత కొంతకాలంగా వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన అవకతవకలపై వస్తున్న ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయని, పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచేందుకు సాంకేతిక భద్రతా చర్యలు, పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచిస్తున్నరు. పరీక్షా విధానంలో విశ్వసనీయతను కాపాడడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంటున్నారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని పరీక్షల నిర్వహణలో సంస్కరణలు చేపట్టాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నరు. పరీక్షా వ్యవస్థపై విద్యార్థుల విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు పారదర్శక విచారణ నిర్వహించి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని దేశవప్తంగా యువత కోరుకుంటున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు