ఆదోనిలో ఘనంగా రజక సంఘం గంగమ్మ పూజలు

ఆదోనిలో ఘనంగా రజక సంఘం గంగమ్మ పూజలు
డప్పులు, మేళతాళాలతో భక్తిశ్రద్ధల మధ్య ప్రత్యేక వేడుకలు
ఆదోని: ఆదోని పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గంగమ్మ పూజా మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. స్థానిక మరాఠా వీధి, పార్వతమ్మ గుడి ప్రాంతాల నుంచి డప్పులు, మేళతాళాలు, పూరివీధుల ద్వారా భారీ ఊరేగింపుగా భక్తులు బయలుదేరి రంజల దోబీ ఘాట్, శాంత మల్లప్ప చెరువు సమీపంలోని తాయమ్మ అవ్వ గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రజక రాష్ట్ర కార్పొరేషన్ చైర్‌పర్సన్ సావిత్రి, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వారు గంగమ్మ తల్లికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడుతూ, రజకులు నిత్యం నీటితో మమేకమై తమ వృత్తిని నిర్వహిస్తారని, గంగమ్మ తల్లి కరుణతో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించామని తెలిపారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు మంచి పంటలు పండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ ప్రతి ఏడాది ఈ గంగమ్మ పూజలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఆదోని పట్టణ రజక సంఘం అధ్యక్షుడు నాగప్ప, కార్యదర్శి సతీష్, జిల్లా నాయకులు రామన్న, ముక్కన్న, ఉరుకుందు, రవి, బేల్దారు ఈరన్న, రంగస్వామి, నాగరాజు, హుసేని, ఎర్రస్వామి, బిల్డర్ మల్లయ్య, రజక ఉద్యోగ సంఘం నాయకులు నాగరాజు, సాయిబాబా, విరూపాక్షి, ఈరన్నతో పాటు పలువురు సంఘ నాయకులు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

– స్వాతంత్ర భారత్ రిపోర్టర్: స్వామిదాసు, ఆదోని

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు