అమరారంలో గడ్డి వాముకు అగ్నిప్రమాదం


పినపాక మండలంలోని అమరారం గ్రామంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహ్మద్ ముజఫర్‌కు చెందిన సుమారు పది ఎకరాల వ్యవసాయ భూమిలో నిల్వ ఉంచిన వరి గడ్డి వాముకు ఆకస్మికంగా నిప్పు అంటుకుంది.
మంటలను గమనించిన స్థానిక రైతులు, గ్రామస్తులు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే గడ్డి పొడిగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు సమాచారం. ఈ ఘటనలో భారీ మొత్తంలో గడ్డి దగ్ధమైనట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రమాదంతో రైతు మహ్మద్ ముజఫర్‌ నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతుకు తగిన సహాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు