గిరిజన యువతకు ఉచిత శిక్షణ – ఉపాధి అవకాశాలకు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీకారం

నిరుద్యోగ గిరిజన యువతకు ఉచిత శిక్షణ – ఉపాధి అవకాశాలు

సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ గిరిజన యువతి, యువకులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో టూరిజం హాస్పిటాలిటీ స్కిల్ కౌన్సిల్ ద్వారా 3 నుండి 6 నెలల పాటు ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం అర్హులైన వారికి ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని అధికారులు వెల్లడించారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ విడుదల చేశారు. గిరిజన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శిక్షణ పొందాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మురళి, మున్సిపల్ అధికారులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు