మణుగూరులో నూతన వారపు సంత ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

మణుగూరులో నూతన వారపు సంత ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మణుగూరు, జూన్ 28:
మణుగూరు మండలంలోని బస్ డిపో – జూనియర్ కళాశాల సందులో నూతనంగా ఏర్పాటు చేసిన వారపు సంతను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలు, రైతులు, చిన్న వ్యాపారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మణుగూరులో వారపు సంత ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఈ సంత ద్వారా స్థానిక రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించే అవకాశం లభిస్తుందని, చిన్న వ్యాపారులకు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని తెలిపారు.

గతంలో వారపు సంత కోసం ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు మణుగూరులోనే మార్కెట్ అందుబాటులోకి రావడంతో ప్రజలకు సమయం, రవాణా ఖర్చు ఆదా అవుతుందని పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం ప్రారంభించిన ఈ వారపు సంత విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో సమితి సింగారం గ్రామపంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, మండల, టౌన్ కాంగ్రెస్ నాయకులు, మైనారిటీ విభాగం ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, వ్యాపారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు