మొక్కలు నాటడమే కాదు.. సంరక్షించుకోవడం ప్రతి పౌరుడి విధి: సర్పంచ్ కిషోర్ నాయక్

మొక్కలు నాటడమే కాదు.. సంరక్షించుకోవడం ప్రతి పౌరుడి విధి: సర్పంచ్ కిషోర్ నాయక్
బూర్గంపహాడ్ - సారపాక :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారి వెంట నాటిన మొక్కల సంరక్షణకు స్థానిక సర్పంచ్ కిషోర్ నాయక్ స్వయంగా ముందుకొచ్చారు.

గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి మొక్కలకు పాదులు చేస్తూ, రక్షణ వలయాలు ఏర్పాటు చేసి వాటి పెరుగుదలకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కిషోర్ నాయక్ మాట్లాడుతూ, "మొక్కలు నాటడం మాత్రమే కాదు, వాటిని సంరక్షించి పెంచడం కూడా ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత" అని అన్నారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కల సంరక్షణలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు