బండి సంజయ్ ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి నుండి వెంటనే భర్తరాఫ్ చేయాలి.
బాధిత మైనర్ బాలికకు వెంటనే న్యాయం చేయాలి.
గుండాల మండలం మే 13 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు, బండి సాయి భగీరథ మీద మైనర్ బాలిక పై అత్యాచార ఘటనలో ఫోక్సో కేసు నమోదు అయినప్పటికీ పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం ఎంతవరకు సరైనది అని బిఆర్ఎస్ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, రైతు సమన్య సమితి మాజీ అధ్యక్షులు మోకాళ్ళ వీరస్వామి అన్నారు. కేసు నమోదు రోజులు గడుస్తున్న భగీరథను అరెస్టు చేయకుండా కాలయాపన చేస్తూ,బండిని కాపాడే ప్రయత్నం చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తున్నామన్నారు. గుండాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బండి సంజయ్ ని కేంద్ర మంత్రి పదవి నుండి తక్షణమే తొలగించాలని బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు అధికార ప్రతినిధి టి రాము, మండల నాయకులు గడ్డం వీరన్న, గొగ్గల రాంబాబు, లింగాగూడెం ఉప సర్పంచ్ శోభన్, పుంజ సుధాకర్, జాడి శ్రీను, గంగాధరి నాగరాజు, జాడి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు