ఉపాధి హామీ కార్మికులకు సామాగ్రి పంపిణీ

ఉపాధి హామీ కార్మికులకు సామాగ్రి పంపిణీ
బోటుగూడెం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కార్మికులకు అవసరమైన సామాగ్రిని సర్పంచ్ నూప బాపనమ్మ, ఉప సర్పంచ్ ధన లక్ష్మి, గ్రామ సెక్రటరీ జ్యోతి, వార్డ్ సభ్యులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాభివృద్ధితో పాటు కార్మికుల జీవనోపాధికి తోడ్పాటు అందుతుందని తెలిపారు. కార్మికులు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పనులు నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది, కార్మికులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు