కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి పదవికి రాజీనామా చేయాలి. 17 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం కు పాల్పడిన బండి సాయి భగీరథ పై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రగతిశీల యువజన సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్.

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి రాజీనామా చేయాలి.

17 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం కు పాల్పడిన బండి సాయి భగీరత్ ను కఠిన చర్యలు తీసుకోవాలి.

ప్రగతిశీల యువజన సంఘం,
ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్.

*గుండాల మండలం మే 15 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి*


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశం లో 
ప్రగతిశీల యువజన సంఘం ప్రగతిశీల మహిళా సంఘంల  ఆధ్వర్యంలో ప్రగతిశీల యువజన సంఘం  జిల్లా అధ్యక్షులు పూనెం మంగయ్య, ప్రగతిశీల మహిళా  సంఘం మండల నాయకులు వాగబోయిన త్రివేణిలు మాట్లాడుతూ కరీంనగర్ బీజేపీ ఎంపీ, కేంద్రం సహయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి 
 భాగీరత్ పై ఫోక్సో కేస్ నమోదైనది. 
17 ఏళ్ల మైనర్ అమ్మాయిపై అత్యాచారం చేసిన నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ ఎంపీ  బండి సంజయ్ రాజీనామ చెయ్యాలి,  కుమారుడు బండి భగీరత్ లీలలు, అరాచకాలు ఎన్నో ఆధారాలతో బయటకు వచ్చాయి. కొడుకును కాపాడే ప్రయత్నలను విరమించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం సాచివేత, దాటవేత ధోరణి అనుసరిస్తునది. బండి సాయి భగీరత్ పై పొక్సో నమోదు చేసి, వెంటనే అరెస్ట్ చేయాలి. బండి భగీరథ అరాచకాలు, లైంగిక ఆరోపణల అన్నింటిపై విచారించాలి. కొడుకును రక్షించే ప్రయత్నం చేస్తున్న బండి సంజయ్ రాజీనామా చేయాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, పోలీస్ లు కేస్ ను ఏమార్చే వైఖరి మానాలి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం 
పి వై ఎల్ అధ్యక్షులు వుకే శ్రావణ్, మండల కార్యదర్శి కల్తీ సుదర్శన్, నాయకులు పూనెం చలపతిరావు, ఆగబోయిన జగ్గారావు, పూనెం బాబురావు, ఈసం వసంతరావు, పూనెం ప్రభాకర్,  ప్రగతిశీల మహిళా సంఘం  మండల నాయకులు వుకే వరలక్ష్మీ, పూనెం పుష్పాలతో, అరె రాంబాబు, వగబోయిన సుశీల, పూనెం స్వొన,  వుకే భద్రంమ్మ, మోకళ్ళ సుమలత, ఈసం సారక్క, మోకాళ్ళ స్వొతి, వుకే రామక్క.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు