విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్న సర్పంచ్

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: సర్పంచ్ సనప అనిత

పినపాక మండలం సీతారాంపురం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని సర్పంచ్ సనప అనిత సూచించారు. శుక్రవారం ఆమె పాఠశాలను సందర్శించి భోజన మెనూను పరిశీలించారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను స్వయంగా పరిశీలించారు. అనంతరం పాఠశాలలోని సౌకర్యాలపై హెడ్మాస్టర్ మోతిలాల్, ఉపాధ్యాయురాలు పద్మతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

విద్యార్థుల ఆరోగ్యం, చదువుకు అనుకూల వాతావరణం కల్పించడంలో పాఠశాల యాజమాన్యం మరింత శ్రద్ధ వహించాలని ఆమె సూచించారు.
#సీతారాంపురం #పాఠశాలభోజనం #విద్యార్థులఆరోగ్యం #పినపాక #విద్య

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు