దుగినేపల్లిలో తాగునీటి సమస్యకు పరిష్కారం

దుగినేపల్లిలో తాగునీటి సమస్యకు పరిష్కారం
దుగినేపల్లి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం సమీపంలో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు చొరవ తీసుకున్నారు. వారి సూచనల మేరకు కొత్త బోర్ వేయించి, మోటార్ ఏర్పాటు చేయించారు.

ఈ కార్యక్రమంలో దున్నేపల్లి సర్పంచ్ కిరణ్‌తో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు. కొత్త బోర్ ఏర్పాటు వల్ల గ్రామ ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందుబాటులోకి రావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

గ్రామ అభివృద్ధి కోసం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని ప్రజాప్రతినిధులు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు